USTHAD BHAGATSINGH :ప‌వ‌న్ సినిమా నుండి పూజాను కావాల‌నే ప‌క్క‌న పెట్టారా..? అస‌లు కార‌ణం ఏంటి..?

ముకుంద సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన పూజాహెగ్డే ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్ గా రానిస్తోంది. వ‌రుస సినిమా ఆఫ‌ర్ ల‌ను అందుకుంటూ పూజాహెగ్డే ఫుల్ బిజీగా ఉంది. తెలుగుతో పాటూ త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ పూజా సినిమాలు చేస్తోంది. అయితే ఈ ఏడాది మాత్రం పూజాహెగ్డేను వ‌రుస ఫ్లాప్ లు ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. పూజా న‌టించిన‌ రాధేశ్యామ్, ఆచార్య లాంటి సినిమాలు డిజాస్ట‌ర్ లుగా నిలిచాయి.

 

ఇదిలా ఉంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో ప్ర‌స్తుతం ఓ సినిమా తెరెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ అనే టైటిల్ తో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో మొద‌ట హీరోయిన్ గా పూజా హెగ్డే ను అనుకున్నారు. ఈ సినిమా కోసం దాదాపు పూజాను క‌న్ఫామ్ చేశారు. అయితే గ‌తేడాది పూజాకు ఫ్లాప్ లు ప‌డ‌టం వ‌ల్ల ఆమెకు ఐర‌న్ లెగ్ అనే పేరు వ‌చ్చింది. దాంతో ఈ సినిమా నుండి పూజాహెగ్డేను త‌ప్పించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *