Raviteja : రవితేజ కెరీర్లో ఫస్ట్ వీక్ అత్యధిక కలెక్షన్లను సాధించిన టాప్ 3 మూవీలు ఇవే..!
మాస్ మహారాజా రవితేజ తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ మూవీలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా రవితేజ నటించిన కొన్ని మూవీలు మొదటి వారం అద్భుతమైన కలెక్షన్లను కూడా రాబట్టాయి. రవితేజ ఇప్పటివరకు తన కెరియర్ లో నటించిన సినిమాలలో మొదటివారం అత్యధిక కలెక్షన్లను సాధించిన టాప్ 3 సినిమాలు ఏవో తెలుసుకుందాం.
ధమాకా : రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఈ సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. శ్రీ లీల హీరోయిన్ గ నటించిన ఈ మూవీ కి త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ కి మొదటి వారం అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఈ మూవీ మొదటి వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 25.22 షేర్ , 47.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
రాజా ది గ్రేట్ : రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ లో మెహరీన్ హీరోయిన్ గా నటించగా … అనిల్ రావిపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మొదటి వారం బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 24.10 కోట్ల షేర్ , 40.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
క్రాక్ : రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా … గోపీచంద్ మలినేని ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఫస్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యేసరికి 22.72 కోట్ల షేర్ , 38 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.