FlOP MOVIES OF DIL RAJU : భారీ అంచనాల తో వచ్చిన అట్టర్ ఫ్లాప్ అయిన 10 దిల్ రాజు సినిమాలు ఇవే…!

డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ను ప్రారంభించిన దిల్ రాజు “దిల్” సినిమాతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. తమిళ స్టార్ హీరోలతో సైతం సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే ఈ స్టార్ ప్రొడ్యూసర్ తీసిన కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ వచ్చి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….

ప్రభాస్ హీరోగా ఇలియానా హీరోయిన్ గా నటించిన మున్నా సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సునీల్ హీరోగా దిల్ రాజు కృష్ణాష్టమి సినిమాను నిర్మించారు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్ తోనే నిర్మించారు. కానీ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అయినా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

 

వరుణ్ సందేశ్ హీరోగా దిల్ రాజు మరోచరిత్ర అనే లవ్ స్టోరీ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాతోనే నాగచైతన్య హీరోగా పరిచయమయ్యాడు. కానీ భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నితిన్ రాశీ కన్నా జంటగా నటించిన శ్రీనివాస కళ్యాణం సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సిద్ధార్థ్… శృతిహాసన్ హీరో హీరోయిన్ లుగా నటించిన ఓ మై ఫ్రెండ్ సినిమాను సైతం దిల్ రాజు నిర్మించారు.

 

ఈ సినిమా యూత్ కు కనెక్ట్ అయింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా బోల్తా కొట్టింది. దిల్ రాజు తన సోదరుడు కుమారుడు ఆశీష్ రెడ్డి హీరోగా రౌడీ బాయ్స్ అనే సినిమాను నిర్మించాడు. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించాడు ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *