SALMAN KHAN POOJA LOVE : బుట్ట‌బొమ్మ‌తో ప్రేమ‌లో స‌ల్మాన్ ఖాన్..అలాంటి ప‌నులు కూడా చేస్తున్నార‌ట‌..?

దుబాయ్ లో ఉంటూ ఇండియ‌న్ సినిమాల రివ్యూలు మ‌రియు సినిమా విశేషాలు చెప్పే ఉమైర్ సందు తాజాగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ తో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ప్రేమ‌లో ఉందంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. బ్రేకింగ్ న్యూస్ అంటూ ప్రేక్ష‌కుల‌కు త‌న ట్వీట్ తో మ‌రింత ఆస‌క్తి పెంచాడు. పూజా హెగ్డే స‌ల్మాన్ రాబోయే రెండు సినిమాల‌లో న‌టించబోతుంద‌ని ట్వీట్ లో పేర్కొన్నాడు. అంతే కాకుండా వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని..ప్రేమ ప‌క్షులు స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా కాల‌క్షేపం చేస్తున్నార‌ని పేర్కొన్నాడు.

 

అంతే కాకుండా స‌ల్మాన్ ఖాన్ స‌న్నిహితులే ఈ విష‌యాల‌ను చెప్పార‌ని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో బిజీగా ఉన్న పూజా స‌ల్మాన్ బ్యాన‌ర్ లో రెండు సినిమాల‌కు ఓకే చెప్ప‌డం వ‌ల్లే ఈ అనుమానాలు మొద‌ల‌య్యాయి. మ‌రోవైపు ఉమైర్ సంధు మాట‌ల‌ను సైతం న‌మ్మ‌లేం. రీసెంట్ గా ప్ర‌భాస్ కృతిస‌న‌న్ సైతం ప్రేమ‌లో ఉన్నార‌ని..కృతి ప్ర‌భాస్ కు ఆదిపురుష్ షూటింగ్ లో ప్రపోజ్ చేశాడ‌ని రాసుకొచ్చాడు.

 

త్వ‌ర‌లోనే ఎంగేజ్మెంట్ కూడా ఉంటుందని రాసుకొచ్చాడు. అయితే ఆ త‌ర‌వాత కృతి స‌నన్ అవి ఉత్తివార్త‌లే అని వ‌రుణ్ దావ‌న్ జోక్ కు అలా అన్నాడ‌ని చెప్పింది. అంతే కాదు ఉమైర్ సంధు రివ్యూలకు ఒక‌ప్పుడు వ్యాల్యూ ఉండేది. కానీ కొంత‌కాలంగా ఆయ‌న ఫ్లాప్ సినిమాల‌ను సైతం బ్లాక్ బ‌స్ట‌ర్ అంటూ పొగుడుతూ రివ్యూలు రాయ‌డం మొద‌లు పెట్టాడు. దాంతో ఆయ‌న రివ్యూల‌కు ట్వీట్ ల‌కు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు పూజా స‌ల్మాన్ మ్యాట‌ర్ కూడా అలాంటిదేనేమో అంటూ నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *