Raviteja : రవితేజ లాస్ట్ 5 మూవీస్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఇవే..!

మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఎన్నో మూవీలలో నటించే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా రవితేజ తన కెరియర్ లో నటించిన ఎన్నో సినిమాలకు అద్భుతమైన ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు కూడా జరిగాయి. ఇది ఇలా ఉంటే రవితేజ ఆఖరుగా నటించిన 5 సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలుసుకుందాం.

రవితేజ తాజాగా ధమాకా మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ డిసెంబర్ 23వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 18.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రవితేజ హీరోగా తెరకెక్కిన రామారావు అన్ డ్యూటీ మూవీ ప్రపంచవ్యాప్తంగా 17.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.

మాస్ మహారాజా రవితేజ హీరోగా డింపుల్ హయాతి , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి మూవీ ప్రపంచవ్యాప్తంగా 22.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.

రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.

రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా మూవీ ప్రపంచవ్యాప్తంగా 19.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *