BALAKRISHNA: షాకింగ్….బాలయ్యకు కూతురు గా శ్రీలీల…ఫ్యాన్స్ ఒప్పుకుంటారా…?

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. సంక్రాంతి రేసులో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి సినిమా కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నెక్స్ట్ సినిమా ఉండబోతుంది. ఈ సినిమా కామెడీ మాస్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది.

 

ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా స్టార్ హీరోయిన్ శ్రీలీల నటించబోతుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలో ఏజ్డ్ లుక్కులో కనిపించిన సంగతి తెలిసిందే. కాగా ఎన్.బి.కె 108 సినిమాలో కూడా బాలయ్య 50 ఏళ్ల వ్యక్తిగా నటించబోతున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *