ALLU ARJUN : అల్లు అర్జున్ ఆ బ్లాక్ బస్టర్ మూవీలను రిజెక్ట్ చేసిన విషయం మీకు తెలుసా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ తన కెరియర్ లో కొన్ని బ్లాక్ బాస్టర్ సినిమాలను కథ నచ్చకపోవడం వల్ల మరియు ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల మరియు కొన్ని ఇతర కారణాల వల్ల వదులుకున్నాడు. మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరియర్ లో వదులుకున్న కొన్ని బ్లాక్ బాస్టర్ మూవీ లు ఏవో తెలుసుకుందాం.

సిద్ధార్థ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన బొమ్మరిల్లు సినిమా కథ ను మొదటిగా భాస్కర్ , అల్లు అర్జున్ కే చెప్పాడట , కాకపోతే కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ ఈ మూవీ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.

అర్జున్ రెడ్డి కథను ముందుగా సందీప్ రెడ్డి వంగా అల్లు అర్జున్ కు వినిపించగా కొన్ని అనివార్య కారణాల వల్ల అల్లు అర్జున్ ఈ మూవీ లో నటించలేకపోయినట్లు తెలుస్తోంది.

నాగ చైతన్య హీరోగా తేరకెక్కిన 100% లవ్ సినిమా కథను కూడా మొదటగా అల్లు అర్జున్ కే చెప్పారట , కానీ ఈ మూవీ లో కొన్ని అనివార్య కారణాల వల్ల అల్లు అర్జున్ నటించలేకపోయినట్లు తెలుస్తోంది.

గీత గోవిందం కథను కూడా మొదటగా అల్లు అర్జున్ కే చెప్పారట , కానీ ఈ మూవీ లో హీరోయిన్ పాత్ర ఎక్కువగా ఉండడం వల్ల ఈ మూవీ లో అల్లు అర్జున్ నటించడానికి ఇష్టపడనట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *