Ramya krishna : నరసింహ మూవీలో “నీలాంబరి” పాత్రను మిస్ చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఎంతో మంది నటీ నటులు తమ కెరియర్ లో కొన్ని సినిమాలలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆ సమయంలో వారు ఇతర మూవీలతో బిజీగా ఉండడం … లేక ఆ సమయంలో వారికి ఆ కథ నచ్చకపోవడం మరియు ఇతర కారణాల వల్ల కొన్ని సినిమాలను వదిలేస్తూ ఉంటారు. అలాగే హీరోయిన్లు కూడా కొన్ని సమయాలలో కొన్ని పాత్రలను వదిలేస్తూ ఉంటారు. అలాగే తెలుగు మరియు తమిళ భాషలలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా ఎన్నో సంవత్సరాల పాటు కెరియర్ ను కొనసాగించిన మీనా కూడా ఒక బ్లాక్ బాస్టర్ మూవీ లోని అద్భుతమైన పాత్రను వదిలి వేసుకుంది.
అసలు విషయంలోకి వెళితే … సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన నరసింహ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లో రమ్యకృష్ణ “నీలాంబరి” పాత్రలో నటించింది. నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించింది. రమ్యకృష్ణ “నరసింహ” మూవీ లోని నీలాంబరి పాత్రతో ప్రేక్షకుల నుండి … విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకుంది.
ఇది ఇలా ఉంటే మొదటగా నరసింహ మూవీ లోని నీలాంబరి పాత్ర చేసే అవకాశం మీనా దగ్గరకే వెళ్లిందట … కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మీనా ఈ మూవీ లో నటించలేక పోయింది. దానితో ఈ అవకాశం రమ్యకృష్ణ కు దక్కింది. రమ్యకృష్ణ “నరసింహ” మూవీ లోని నీలాంబరి పాత్రలో తన నటనతో ప్రేక్షకులను అలరించింది. అలాగే నరసింహ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.