Benifits of laughting buddha : ఇంట్లో లాఫింగ్ బుద్ద విగ్రహాన్ని పెట్టుకుంటారు…ఆ విగ్రహం పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?
లాఫింగ్ బుద్దవిగ్రహం ఇంట్లో పెట్టుకోవడం వల్ల అదృష్టం వరిస్తుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అయితే ఎ దిక్కున పెట్టుకోవాలి..? ఎలా పెట్టుకోవాలి అన్నది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. లాఫింగ్ బుద్ద విగ్రహానికి గుండ్రటి తల, పెద్ధ పొట్ట , మనసారా నవ్వుతూ కనిపించే గుండ్రటి ముఖం ఉంటాయి. ఈ బొజ్జ దీపయ్య ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు లోటు అక్కడ లోటు ఉండదట. ఎవరైనా కోపంలో ఉన్నా లేదా బాధలో ఉన్నా లాఫింగ్ బుద్ద విగ్రహాన్ని కొన్ని సెకన్లు చూస్తే చాలు నవ్వు వచ్చేస్తుంది. ఒకప్పుడు భుజాన జోలె చేతిలో బిక్షపాత్ర పట్టుకుని తిరిగే ఈయన పిల్లలూ ఏది అడిగిన తీసి ఇచ్చేవాడంట.
ఉదయాన్నే ఈయన ముఖం చూస్తే రోజంతా హ్యాపీ గా గడిచిపోయేదంట. జపాన్ లో లాఫింగ్ బుద్ద ను ఏడుగురు అదృష్టవంతుల దేవుల్లో ఒకరిగా పూజిస్తుంటారు. హిందువులకి లక్ష్మి దేవి వలే సంపదలు ఇచ్చే దేవునిగా ఈయనను చైనీయులు , జపనీయులు కొలుస్తారు. ఇంట్లో ఈ విగ్రహం పెట్టుకొంటే సౌభాగ్యం,విజయం, సంపద, ఆనందం కలుగుతాయని భావిస్తారు. లాఫింగ్ బుద్ధ లోహం, క్రిస్టల్స్ వంటి వాటితో తయారు చేస్తారు. వ్యాపారాలు చేసేవాళ్ళు అయా ప్రదేశాల్లో లాఫింగ్ బుద్దవిగ్రహం పెట్టుకోవడం వల్ల అధిక రాబడి వస్తుందని భావిస్తారు. ఈ విగ్రహాలు రకరకాల ఫోజులతో దొరుకుతుంటాయి. ప్రతి విగ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.
పిల్లలతో ఉన్న లాఫింగ్ బుద్ధ పిల్లల ఎదుగుదలకు ఉపయోగ పడుతుందoట. ధనం మూట ఉన్న లాఫింగ్ బుద్ద ఉంటే ధనం సకాలంలో అందుతందంట. చేతిలో బౌల్ పట్టుకొని ఉన్న లాఫింగ్ బుద్ధ ఉంటే ఇంట్లో సుఖ, సంతోషాలు ఉంటాయి అంట. తాబేలు ఉన్న లాఫింగ్ బుద్ధ అయితే ఇంట్లో ధనం చేకూరుతుందంట. ఇంట్లో ఆఫీసులో ధనం మూటతో ఉన్న లాఫింగ్ బుద్ధను పెట్టుకొంటే చాలా మంచిది. బౌలుని ఆకాశం వైపు ఎత్తిపట్టిన లాఫింగ్ బుద్ధ ఉంటే విశ్వం నుంచి అనంతమైన సంపద అందుకున్నట్లు ఉంటుందంట. లాఫింగ్ బుద్ద ను కొనేటప్పుడు అత్యంత పెద్దది కొనడం మంచిదట.