Balakrishna : బాలయ్య మూవీలో అనంతపురం అమ్మాయి..?
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ప్రస్తుతం “వీర సింహా రెడ్డి” అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా , దునియా విజయ్ విలన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ “వీర సింహా రెడ్డి” మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. నిన్ననే ఈ మూవీ లాంఛనంగా ప్రారంభం కూడా అయింది. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందబోతుంది.
ఈ మూవీ కి “బ్రో ఐ డోంట్ కేర్” అనే టైటిల్ ను ఈ మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా అంటే ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ ప్రియాంక జావల్కర్ ను బాలకృష్ణ కు జోడిగా తీసుకోవడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరస్ అవుతుంది.