Manisharma : అందుకే ఆచార్య మూవీలో “బిజిఎం” సెట్ కాలేదు… మణిశర్మ..!

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి మణిశర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చూడాలని ఉంది మూవీ తో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ను మొదలు పెట్టిన మణిశర్మ ఎన్నో మూవీ లకు సంగీతాన్ని అందించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు.

 

ఇది ఇలా ఉంటే మణిశర్మ తాజాగా ఆలీతో సరదాగా అనే టాక్ షో కు , గెస్ట్ గా వచ్చాడు. ఇందులో భాగంగా ఆలీ , మణిశర్మ ను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తేరకెక్కిన ఆచార్య సినిమాకి “బిజియం” అంతా బాగా సెట్ కాలేదు అని బయట టాక్ వచ్చింది. అది ఎందుకు జరిగింది … అనే ప్రశ్నను ఆలీ , మణిశర్మ ను అడిగాడు. దానితో మణిశర్మ నేను చిరంజీవి గారి మూవీ లకు పనిచేసి ఇండస్ట్రీకి వచ్చాను.

 

నాకు చిరంజీవి మూవీకి ఎలా “బిజీయం” స్కోర్ ఇవ్వాలి అనేది తెలుసు. దానికి తగ్గట్టుగానే ఒక వర్షన్ ను కూడా రెడీ చేశాను. డైరెక్టర్ గారు వచ్చి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఈ మూవీ లో వద్దు అన్నారు. దానితో ఈ మూవీ కి మరో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్షన్ రెడీ చేశాము అని మణిశర్మ తాజాగా ఆలీతో సరదాగా షో లో చెప్పుకొచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *