మల్లారెడ్డి ఇంట్లో ఐటి దాడులు.. 15 కిలోల బంగారం తో పాటు ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే..?
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లపై ఐటి దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రోజుల తరబడి ఐటి అధికారులు మల్లారెడ్డి తో పాటు ఆయన కొడుకు …అల్లుడి ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఇక ఈ సోదాల సమయంలో ఐటి అధికారులు రూ.18.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాకుండా 15 కిలోల బంగారు ఆభరణాలను ఐటి అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన లాప్ టాప్ లు… కీలక పాత్రలను సైతం ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే మల్లారెడ్డి మాత్రం కేంద్ర ప్రభుత్వం కుట్రతో ఈ దాడులు చేయిస్తుందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఐటి అధికారులు మల్లారెడ్డి సైతం పరస్పరం ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.