Virat kohli : కోహ్లీ కాకుండా వారు కొట్టి ఉంటే బాధపడే వాడిని… పాకిస్తాన్ స్టార్ బౌలర్..!

టీం ఇండియా కొన్ని రోజుల క్రితమే టి20 వరల్డ్ కప్ లో పాల్గొన్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ వరల్డ్ కప్ లో టీం ఇండియా చాలా మెరుగైన ప్రదర్శనను కనబరిచింది. సెమీస్ వరకు వెళ్ళింది. సెమిస్ లో కూడా టీం ఇండియా అద్భుతమైన ప్రదర్శనను కనబరిచినప్పటికి టీం ఇండియా ఓటమి పాలయ్యింది. దానితో ఈ సంవత్సరం టి20 వరల్డ్ కప్ ను టీమ్ ఇండియా దక్కించుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం టి20 వరల్డ్ కప్ లో ఇండియా మొదటి మ్యాచ్ ను పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడిన విషయం మనకు తెలిసింది.

 

ఈ మ్యాచ్ లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అత్యద్భుతమైన ప్రదర్శనను కనబరిచిన విషయం కూడా మనకు తెలిసింది. ఇండియా దాదాపు ఓటమి అంచుల్లో ఉన్న సమయంలో విరాట్ కోహ్లీ తన అత్యుత్తమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఇండియాకు గెలుపును అందించాడు. ఇది ఇలా ఉంటే కోహ్లీ పాకిస్తాన్ మ్యాచ్ లో వరసగా కొట్టిన రెండు సిక్సర్ లను ఇప్పటికీ ఎవరు మర్చిపోలేదు.

 

అయితే తన బౌలింగ్ లో విరాట్ కోహ్లీ కొట్టిన సిక్సర్ లపై తాజాగా పాకిస్తాన్ బౌలర్ హారిస్ రాఫ్ స్పందించాడు. విరాట్ కోహ్లీ ఓ మాస్టర్ క్లాస్ బ్యాటర్. అందుకే అతడు కొట్టిన పెద్దగా ఏ మాత్రం బాధ అనిపించలేదు. ఒక వేళ విరాట్ కోహ్లీ కాకుండా హార్దిక్ పాండే కానీ దినేష్ కార్తీక్ కానీ ఆ సిక్సర్ లను కొట్టినట్లు అయితే నేను బాధపడేవాడిని అని హరీస్ రఫ్ తాజాగా అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *