Samantha : “యశోద” అఫీషియల్ “ఓటిటి” విడుదల తేదీ వచ్చేసింది… ఆ తేదీన… ఆ ప్లాట్ ఫామ్ లో..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత తాజాగా యశోద అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. హరి శంకర్ … హరీష్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో ఉన్ని ముకుందన్ , వరలక్ష్మి శరత్ కుమార్ , రావు రమేష్ , మురళీ శర్మ ముఖ్యపాత్రలలో నటించారు.

 

ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాలను నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. అలాగే ఈ మూవీ మంచి కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ “ఓ టి టి” విడుదల తేదీ వచ్చేసింది. ఈ మూవీ యొక్క “ఓ టి టి” హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది.

 

తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ యశోద మూవీ ని డిసెంబర్ 9 వ తేదీ నుండి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న యశోద మూవీ “ఓ టి టి” ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *