Ravendra jadeja : ఓటు హక్కును వినియోగించుకున్న రవీంద్ర జడేజా మరియు అతని భార్య..!

టీం ఇండియాలో అత్యుత్తమ ఆల్ రౌండర్ ఆటగాళ్లలో ఒకరు అయినటువంటి రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా భారత క్రికెట్ అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవీంద్ర జడేజా ఇప్పటికే ఎన్నో టి 20 , వన్డే , టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లలో అత్యద్భుతమైన ఆల్ రౌండర్ ప్రదర్శనను కనబరిచి ఎంతో మంది క్రికెట్ అభిమానుల మనసు దోచుకున్నాడు.

 

ఇది ఇలా ఉంటే తాజాగా రవీంద్ర జడేజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న రవీంద్ర జడేజా అందుకు సంబంధించిన ఒక ఫోటోను తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటో వైరల్ గా మారింది.

 

రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా , జామ్ నగర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బిజెపి పార్టీ తరుపు నుండి పోటీ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆమె కూడా తన ఓటు హక్కును రాజ్ కోట్ నియోజకవర్గంలో వినియోగించుకుంది.

 

రవీంద్ర జడేజా భార్య రివాభా జడేజా కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *