Avatar : “అవతార్ 2” మూవీకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా సినిమా విడుదల అవుతుందా అని ఎదురుచూసిన మూవీలలో అవతార్ ది ఆఫ్ వాటర్ మూవీ ఒకటి. ఈ మూవీ కి జామ్స్ కామరున్ దర్శకత్వం వహించాడు. అవతార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. అలా అవతార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడంతో అవతార్ ది వే ఆఫ్ వాటర్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 

అలాగే అవతార్ మూవీ ఆ సమయంలో ఇండియాలో కూడా అద్భుతమైన భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దానితో ఇండియాలోని సినీ ప్రేమికులు కూడా అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా నిన్న అనగా డిసెంబర్ 16 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున విడుదల అయింది.

 

మరి ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం.
నైజాం : 7.05 కోట్లు .
సీడెడ్ : 1.80 కోట్లు .
ఆంధ్ర : 4.80 కోట్లు .
మొత్తంగా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలు అవతార్ ది ఆఫ్ వాటర్ మూవీ 13.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *