Valteru veeraiah movie story: వాల్తేరు వీరయ్య సినిమా కథ లీక్….? సినిమాలో అదే హైలెట్ అట…?
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. చిరు 150వ చిత్రంతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఇక చిరు సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది.
అంతేకాకుండా ఇప్పటికే సినిమా నుండి చిరంజీవి లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. చిరు కు జోడీగా బ్యూటీ శ్రుతి హాసన్ నటిస్తోంది. అదేవిధంగా ఈ సినిమా నుండి విడుదల చేసిన బాస్ సాంగ్ కు సైతం అభిమానులు ఫిదా అవుతున్నారు. ఊర్వశి రౌటెల ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేసింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా గురించి ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం… సినిమాలో చిరంజీవి తండ్రికి ఇద్దరు భార్యలు ఉంటారు. అందులో ఒక భార్యకు పుట్టిన కుమారుడే వాల్తేరు వీరయ్య… అంతేకాకుండా మరో భార్యకు పుట్టిన కుమారుడు రవితేజ… ఇక వీరయ్య కార్మిక సంఘానికి లీడర్ అయితే రవితేజ పోలీస్ అవుతాడట.
అయితే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒకానొక సమయంలో గొడవలు జరుగుతాయి. అయితే ఆ సమయంలో విలన్ ఎంట్రీ ఇస్తాడు ఆ తర్వాత ఇద్దరు కలుస్తారట. ఆ తరవాత అసలు ఏం జరుగుతుందన్నదే ఈ సినిమా కథ. అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.