VASTHU TIPS : వాస్తు టిప్స్…ఇంటి ముఖ ద్వారం చుట్టుప‌క్క‌ల ఈ 5 వ‌స్తువుల‌ను అస్స‌లు పెట్టకూడ‌ద‌ట‌..!

హిందూ పురాణాలలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు రాజులు సైతం తమ ఇంటిని ఇంట్లోని వస్తువులను వాస్తు ఆధారంగా నిర్మించుకునేవారు. వాస్తు సరిగా లేకపోతే ఆర్థిక సమస్యలు… ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కచ్చితంగా ఇల్లు క‌ట్టుకునేట‌ప్పుడు… ఇంట్లో వస్తువులను అమర్చేటప్పుడు వాస్తుని పాటించాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో వాస్తు ప్రాముఖ్యత కూడా ఎక్కువగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ఇంటిని నిర్మించుకునేటప్పుడు వాస్తు నిపుణులను పిలిపించుకుని సలహాలు సూచనలు తీసుకుంటున్నారు.

 

అయితే ఇక్కడ కొత్త ఇంటిని నిర్మించుకునేటప్పుడు దాని ముఖద్వారం ఏ విధంగా ఉండాలో వాస్తు నిపుణులు కొన్ని సూచనలు చేశారు. అవి తెలుసుకుందాం…. ఇంటి ప్రధాన ముఖద్వారం బయట ఏదైనా ఫౌంటెన్ లేదా నీటి కేంద్రీకృత అలంకరణలను ఉంచకూడదట. అంతేకాకుండా ప్రవేశద్వారం వెలుపల చెప్పులు పెట్టుకునే రాక్ లు… డస్ట్ బిన్ లు అస్సలు పెట్టుకోకూడదు.

 

అదేవిధంగా మెయిన్ డోర్ దగ్గర బాత్రూం అస్సలు నిర్మించకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రధాన ముఖద్వారానికి నల్లని రంగును వేయకూడదని సూచిస్తున్నారు. అదేవిధంగా ప్రవేశ ద్వారం ఎక్కువగా వెలుతురు పడే విధంగా ఉండాలని చెబుతున్నారు. అంతేకాకుండా తలుపును సున్నితమైన నామఫలకాలతో.. పవిత్రమైన తోరణాలతో అలంకరించాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *