Ajith : తక్కువ ధరకు అమ్ముడుపోయిన “తునివు” తెలుగు థియేటర్ హక్కులు… సినిమా బాగుంటే పండగే..!

కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజిత్ ఆఖరుగా వలిమై అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో తరికెక్కిన ఈ మూవీ ని బోనీ కపూర్ నిర్మించాడు. ఈ మూవీ ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అజిత్ “తునివు” అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

 

ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదల చేయడానికి మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థ్రియేటికల్ హక్కులను ఈ మూవీ యూనిట్ ఇప్పటికే అమ్మివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థ్రియేటికల్ హక్కులను కేవలం 3 కోట్లకే అమ్మేసినట్లు తెలుస్తోంది.

 

ఒక వేళ సినిమా కనుక పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నట్లు అయితే అతి తక్కువ రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుని అత్యధిక లాభాలను దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఉంటే తునివు మూవీ ని జనవరి 11 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *