AVATAR 2 MOVIE REVIEW : అవతార్ 2 సినిమా ఫస్ట్ రివ్యూ…సినిమా ఎలా ఉందంటే..?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న సినిమా అవతార్ 2. జేమ్స్ కెమెరాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరరెక్కింది. 2009లో వచ్చిన అవతార్ కు సీక్వెల్ గా అవతార్ 2 తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ ను లండన్ లో ప్రదర్శించారు. సినిమా క్రిటిక్స్ మరియు యూట్యూబర్స్ కోసం ఈ సినిమాను ప్రదర్శించారు. వాళ్లు చెబుతున్న మాటల ప్రకారంగా ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం…..
అవతార్ విజువల్ వండర్ కాగా అవతార్ 2 నెక్స్ట్ లెవల్ విజువల్ వండర్ గా ఉందని క్రిటిక్స్ చెబుతున్నారు. అవతార్ ఎమోషనల్ గా ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయిన సినిమా కాగా అవతార్ 2 కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా మూవీ లవర్స్ కు సరికొత్త ఎక్స్పీరియన్స్ ను ఇస్తుందని అంటున్నారు. అవతార్ కంటే ఈ సినిమా పది రెట్లు ఉందని చెబుతున్నారు. అవతార్ పండోరా గ్రహం పై భూమి పై మరియు ఆకాశంలో జరగ్గా అవతార్ 2 నీటిలో జరిగింది.
ఈ సినిమా షూటింగ్ ను సైతం ఎక్కువ శాతం సముద్రం అంతర్బాగంలో తెరకెక్కించారు. అవతార్ 2 మాస్టర్ పీస్ అద్భుతం అంటూ సినిమాను క్రిటిక్స్ ఆకాశానికి ఎత్తుతున్నారు. సినిమా మేకింగ్ టెక్నికల్ వ్యాల్యూస్ బాగున్నాయని చెబుతున్నారు. ఇక ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల వరకూ ఉందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం అండర్ వాటర్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించారని చెబుతున్నారు. ఇక డిసెంబర్ 16 భారీ అంచనాలతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.