Rajini kanth birthday special: రజినీ కాంత్ బర్త్ డే స్పెషల్…ఆయన కెరీర్ లో సాధించిన రికార్డులు ఇవే…!
ఇండియన్ సినిమా చరిత్రలోని గొప్ప హీరోల్లో రజనీకాంత్ కూడా ఒకరు. హీరో రజనీకాంత్ కండక్టర్ గా ఉద్యోగం చేస్తూ తన స్టైల్.. మ్యనరిజం తో సినిమా అవకాశాలను దక్కిచుకున్నారు. సినిమాల్లోనూ రజినీ అదే మేనరిజం ను ప్రదర్శించారు. తమిళ ఇండస్ట్రీని ఏలిన నటుల్లో రజినీకాంత్ కూడా ఒకరు. రజినీ కాంత్ తమిళ హీరో అయినప్పటికీ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
ఆయన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. చంద్రముఖి, భాష, రోబో లాంటి సినిమాలు రజనీకాంత్ క్రేజ్ ను ఎక్కడికో తీసుకువెళ్లాయి. ఇదిలా ఉండగా రజనీకాంత్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన కెరీర్ లో సాధించిన కొన్ని రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…. రజినీ కాంత్ ఇప్పటివరకు మొత్తం 168 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
అంతేకాకుండా నటించిన 168 సినిమాల్లో రజనీకాంత్ కు 150 ఇండస్ట్రీ హిట్ లు ఉన్నాయి. అదేవిధంగా రజిని ఆరు స్టేట్ అవార్డులను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా కళా రంగంలో గొప్ప అవార్డు అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సైతం రజనీకి వచ్చింది. అంతేకాకుండా రజిని ఐకాన్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమాగా నిలిచారు.