SALAR MOVIE UPDATE : స‌లార్ సినిమాలో కాంతార న‌టుడు..! టీజ‌ర్ రిలీజ్ డేట్ ఇదేన‌ట‌..?

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం పరుస పాండియా సినిమాలలో నటిస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించినమేర విజయం సాధించలేదు. ఇక ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తీసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో యాక్షన్స్ సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం వరకు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐ సినిమా గురించి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో రీసెంట్ బ్లాక్ బస్టర్ కాంతార నటుడు ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

 

ఈ సినిమాతో పాపులారిటీని సంపాదించుకున్న నవీన్ బండెల్ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. కాంతార సినిమాలో నవీన్ బండల్ తన లుక్ తో ఆకట్టుకున్నారు. భయంకరమైన కళ్ళతో నవీన్ బండెల్ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇప్పటికే చాలా సినిమాల్లో నవీన్ ఆఫర్ లు అందుకుంటున్నారు. ఇక సలార్ లో నవీన్ బండేల్ విలన్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సలార్ సినిమా టీజర్ ను మే లో విడుదల చేయబోతున్నట్టు ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *