SAMANTA REJECTED MOVIES : స్టోరీ సెల‌క్ష‌న్ లో సమంత తోపు..రిజెక్ట్ చేసిన సినిమాల్లో 8 ఫ్లాప్లులే..!

న‌టీన‌టుల కెరీర్ స్టోరీ సెల‌క్ష‌న్స్ పైనే ఆధార‌పడి ఉంటుంది. మంచి కథ‌ల‌ను ఎంచుకుంటే అవి హిట్ అవుతాయి. అదే ఫ్లాప్ క‌థ అని ముందుగానే గుర్తించి రిజెక్ట్ చేస్తే సేఫ్ జోన్ లో ఉంటారు. కాగా టాలీవుడ్ లో స్టోరీ సెల‌క్ష‌న్ విష‌యంలో హీరోయిన్ స‌మంత‌ను మెచ్చుకోవ‌చ్చు. స‌మంత త‌న కెరీర్ లో ప‌ది సినిమాల‌ను రిజెక్ట్ చేస్తే అందులో ఎనిమిది సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం….మ‌నిర‌త్నం ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన కాద‌ల్ సినిమాలో స‌మంత‌ను హీరోయిన్ గా అనుకున్నారు.

 

కానీ స‌మంత క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో రిజెక్ట్ చేసింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ఎవడు సినిమాలో హీరోయిన్ గా స‌మంత‌ను సంప్రదించారు కానీ స‌మంత రిజెక్ట్ చేసింది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఐ సినిమా కోసం స‌మంత‌ను సంప్ర‌దించారు. కానీ క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో స‌మంత రిజెక్ట్ చేసింది. రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన బ్రూస్లీ సినిమాను కూడా స‌మంత రిజెక్ట్ చేసింది. అంతే కాకుండా నాని హీరగా న‌టిస్తున్న ద‌స‌రా సినిమాను కూడా స‌మంత రిజెక్ట్ చేశారు.

 

యూట‌ర్న్ సినిమాలో న‌టించిన స‌మంత‌కు హిందీ యూట‌ర్న్ లో నటించే ఛాన్స్ వ‌చ్చింది కానీ రిజెక్ట్ చేసింది. అశ్విన్ శ‌ర్వ‌న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మాయ సినిమాలో న‌టించే ఛాన్స్ రాగా ఈ సినిమాను కూడా స‌మంత రిజెక్ట్ చేసింది. ఎన్టీఆర్ కథానాయ‌కుడులో ముఖ్య‌మైన పాత్ర కోసం స‌మంత‌ను సంప్ర‌దించారు కానీ స‌మంత రిజెక్ట్ చేసింది. బాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ సినిమా కోసం సమంత‌ను సంప్ర‌దించారు. కానీ ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *