PATHAN MOVIE : షారుక్ ఖాన్ కు బిగ్ షాక్..బైకాట్ పఠాన్ కు ముస్లీంబోర్డు సపోర్ట్..!
ఈ మధ్య బాలీవుడ్ నుండి ఏ సినిమా వచ్చినా బైకాట్ అంటున్నారు బాలీవుడ్ సినిమా లవర్స్. అంతే కాకుండా ఒక్కో సినిమాకు ఒక్కో రీజన్ ను వెతుకుతున్నారు. ఇక తాజాగా నెటిజన్లు షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకునే హీరోయిన్ గా నటించిన పఠాన్ సినిమాను బైకాఠ్ చేయాలంటూ గత వారం రోజులుగా ట్విట్టర్ లో బైకాట్ పఠాన్ అంటూ ట్వీట్ లు చేస్తున్నారు.
అంతే కాకుండా దీపికా పదుకునే వేసుకున్న బట్టలపై బీజేపీ నాయకులు పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీపికా వేసుకున్న దుస్తుల సీన్లను తొలగించకపోతే సినిమాను థియేటర్ లలో ఆడనివ్వము అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. కాగా ఇప్పుడు షారుక్ ఖాన్ కు మరో షాక్ తగిలింది. సినిమా ను బైకాట్ చేయాలంటూ వస్తున్న ఆరోపణలకు మద్దతు పలికింది. సినిమాలోని అశ్లీల సన్నివేశాలపై బోర్డ్ అసహనం వ్యక్తం చేసింది.
ముస్లీం కమ్యునిటీని అగౌరపరిచేలా ఉందని ముస్లీం కమ్యునిటిలో పఠాన్ లు అత్యంత గౌరవనీయులని వారిని అవమానించేలా సినిమా ఉందని ఆరోపించింది. సినిమాను బైకాట్ చేయాలనుకునేవారికి మధ్యప్రదేశ్ కు చెందిన ఉలేమా బోర్డ్ సపోర్ట్ చేసింది.