SR NTR : ఎన్టీఆర్ చేతిరాత ఎంత అందంగా ఉందో చూసారా..? ఆ లేఖలో ఏం ఏముందంటే..?

తెలుగు చిత్ర సీమ గర్వించదగ్గ గొప్ప నటుడు ఎన్టీ రామారావు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాలపై ఉన్న ఆసక్తితో మొదట నాటకాల్లో తన టాలెంట్ ను ప్రదర్శించి…. ఎన్టీ రామారావు ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోగా పరిచయమైన అతి తక్కువ కాలంలోనే అన్నగారు తెలుగు ఇండస్ట్రీలోనే నంబర్ వన్ హీరోగా నిలిచారు.

 

 

కేవలం సినిమాల్లోనే కాకుండా ఆ తర్వాత రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రిపై కుర్చీపై కూర్చున్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు ఎన్నో పథకాలను ప్రారంభించి పేద ప్రజలకు అండగా నిలిచారు. రూపాయికి కిలో బియ్యం పథకాన్ని మొదట ప్రవేశపెట్టింది అన్నగారే. ఈ పథకాన్ని ఇప్పటికీ రకరకాల పేర్లు మార్చి అనేక రాష్ట్రాలలో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ కు తెలుగు పై ఉన్న పట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే. గుక్క తిప్పకుండా డైలాగులు చెప్పడంలో ఆయనకు ఇండస్ట్రీలోనే ఎవరు సాటి రాలేరు. అయితే కేవలం మాటల్లోనే కాకుండా రాతల్లోనూ ఆయన ఘనుడే… సినిమాల్లోకి రాకమందు ఎన్టీ రామారావు చదువుల్లోనూ రాణించారు. 1100 మంది పోటీపడిన మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఏడవ ర్యాంకులు సాధించారు. కొంతకాలం పాటు సబ్ రిజిస్టార్ గా సైతం ఆయన ఉద్యోగం చేశారు. ఇక ఎన్టీఆర్ చేతిరాత చూసినట్లయితే ముత్యాల కంటే అందంగా ఉంటుంది. ఎలాంటి తప్పులు లేకుండా చాలా అందంగా చూస్తే ప్రింట్ తీసారేమో అనే విధంగా కనిపిస్తుంది. తాజాగా ఎన్టీఆర్ ఓ సినిమా షూటింగ్ మధ్యలో విజయచిత్ర అనే పత్రిక ద్వారా రాసిన మూడు పేజీల లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లేఖలో ఎన్టీఆర్ భాష మరియు రైటింగ్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *