Mahesh babu net worth : బెంగళూరు హైదరాబాద్ లో కళ్ళు చెదిరే ఆస్తులు…మహేష్ బాబు మొత్తం ఆస్తుల లెక్క ఎంతంటే…?

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడు గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. టాప్ డైరెక్టర్ లతో మహేష్ బాబు సినిమాలు చేస్తున్నారు. ఒకే రకమైన పాత్రలు చేయకుండా మాస్ క్లాస్ అంటూ అన్ని రకాల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

 

అంతేకాకుండా టాలీవుడ్ లోనే అత్యధిక అభిమానులు ఉన్న హీరోగా మహేష్ బాబు నిలిచారు. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మహేష్ బాబుకు క్రేజ్ ఉంది. అయితే తాజాగా మహేష్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు హీరో గానే కాకుండా వ్యాపారవేత్తగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

 

మహేష్ బాబు ఏషియన్ సంస్థతో కలిసి ప్రారంభించిన ఏఎంబీ థియేటర్ హైదరాబాదులోనే నెంబర్ వన్ థియేటర్ గా నిలిచింది. అంతేకాకుండా రీసెంట్ గా మహేష్ బాబు తన భార్య నమ్రత పేరుపై ఓ లగ్జరీ హోటల్ ను సైతం ప్రారంభించారు. ఇక వ్యాపారాలు సినిమాల ద్వారా మహేష్ బాబు భారీగా సంపాదించినట్లు తెలుస్తోంది. ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ రాసిన కథనం ప్రకారం గా…. మహేష్ బాబు ఆస్తుల విలువ 32 మిలియన్ డాలర్ల పైనే ఉంటుందని తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం మహేష్ బాబు ఆస్తుల విలువ 250 కోట్లకు పైగానే ఉంటుంది.

 

హైదరాబాదులో మరియు బెంగళూరులో మహేష్ బాబుకు కోట్ల విలువ చేసే ప్రాపర్టీలు ఉన్నాయి. సొంత ఇల్లు…. ఇంటిలో స్విమ్మింగ్ పూల్… మినీ థియేటర్ లాంటి సదుపాయాలు ఉన్నాయి. అంతేకాకుండా మహేష్ బాబు వద్ద రేంజ్ రోవర్ ,ఆడి ,బెంజ్ కార్లు ఉన్నాయి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు ఒక్కో సినిమాకు 50 కోట్ల పైనే తీసుకుంటున్నట్టు సమాచారం అంతేకాకుండా ఒక్కో యాడ్ కు 80 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *