Gurthundha Seethakalam Review : గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ…. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హిట్ కొట్టాడా….?
పరిచయం :
కథకు ప్రధాన్యత ఉన్న సినిమాల్లో నటించే హీరోలలో సత్యదేవ్ కూడా ఒకరు. విభిన్న పాత్రలతో… సరికొత్త కథలతో సత్యదేవ్ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తాజాగా సత్యదేవ్ తమన్నా ముఖ్యమైన పాత్రలలో నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. కాలభైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. అంతేకాకుండా కావ్యశెట్టి, మెగా ఆకాష్, ప్రియదర్శిని, సుహాసిని సినిమాలో ముఖ్యమైన పాత్రలలో నటించారు. నేడు ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం.
కథ :
ఈ సినిమా కథ జర్నీలో పరిచయమైన ఇద్దరు వ్యక్తుల సంభాషణ తో ప్రారంభం అవుతుంది. ఇద్దరు వ్యక్తులు దేవ్ (సత్యదేవ్) దివ్య (మెగా ఆకాష్) మధ్య జరిగే సంభాషణలుగా కొనసాగుతుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి అయిన సత్యదేవ్ కాలేజీ స్కూల్ డేస్ లో ఒక్కో అమ్మాయితో ప్రేమలో పడతాడు. స్కూల్ డేస్ లో అట్రాక్షన్ కానీ కాలేజీలో అమ్ము అలియాస్ అమృత కావ్య శెట్టిని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమె కోసం బెంగళూరు కంపెనీలో ఉద్యోగం సాధిస్తాడు. అమ్ము కోసం ఉద్యోగం తెచ్చుకున్నప్పటికీ తన తల్లి చెప్పిన మాటలు విని అమ్ము సత్యవేవ్ కు దూరమవుతుంది. అంతేకాకుండా సత్యదేవ్ ను అవమానిస్తుంది. అలాంటి సమయంలోనే దేవ్ జీవితంలోకి నిధి (తమన్న) ఎంట్రీ ఇస్తుంది. ఇక నిధిని పెళ్లి చేసుకున్న తర్వాత సత్యదేవ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి….. ఆ తర్వాత అతని జీవితం ఎలా గడుస్తుంది అన్నదే ఈ సినిమా కథ.
విశ్లేషణ :
సినిమాలో కొత్తదనం ఏమీ ఉండదు. హీరోకు స్కూల్ కాలేజీ డేస్ లో ప్రేమాయణం ఉండడం…. వాటిని నెమరు వేసుకోవడం నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయి. అయితే కథనం మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ కాస్త ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ ల మధ్య ఆకట్టుకునే సన్నివేశాలు ఉంటాయి. ప్రేమ కథా చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కానీ సినిమాలో మాత్రం బలమైన సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. సినిమాలో సత్యదేవ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. రకరకాల వేరియేషన్స్ లో అద్భుతంగా నటించాడు. నిధి పాత్రలో తమన్నా తన నటనతో ఆకట్టుకుంది. మిగతా హీరోయిన్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాలో ప్రియదర్శి తన కామెడీ టైమింగ్ తో నవ్విస్తూనే…. ఎమోషనల్ సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీ నటులు తమ పాత్ర పరిధిమేర నటించారు. సినిమా నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ప్రేమ కథలను ఇష్టపడేవారు ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.