AVATAR 2 : “అవతార్” సినిమా ప్లస్ లు మైనస్ లు ఇవే…సినిమాలు అదే అతిపెద్ద మైనస్…!
జేమ్స్ కెమెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్ పార్ట్ 2 సినిమా డిసెంబర్ 16న నేడు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జేమ్స్ కెమెరాన్ అవతార్ పార్ట్ 1 తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమా పార్ట్ 2 పై అంచనాలు భారీగా పెరిగాయి. అలా ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైంది.
హైదరాబాద్… ముంబై సహా ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శించబడ్డాయి. అయితే అవతార్ సినిమా విజువల్ వండర్ కాగా… అవతార్ 2 కూడా విజువల్ వండర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా మాత్రం అవతార్ రేంజ్ లో ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
అవేంటో ఇప్పుడు చూద్దాం….. ఈ సినిమాలోని మైనస్ ల విషయానికి వస్తే సినిమా కథ పార్ట్ 1 మాదిరిగానే ఉంది. సినిమా కథలో కొత్తదనం ఎక్కడా కనిపించలేదు. ఇక సినిమా అచ్చం మొదటి పార్ట్ మాదిరిగానే ఉంది. సినిమా పూర్తయిన తరవాత కొత్త సినిమా చూసిన ఫీలింగ్ అస్సలు లేదు. అంతే కాకుండా ఈ సినిమా 3:12 నిమిషాల రన్ టైం తో విడుదలైంది. దాంతో ప్రేక్షకులకు కొన్ని కొన్ని సార్లు విసుగు వచ్చింది.
కథలో మ్యాటర్ లేకపోవడంతో సాగదీతగా అనిపించింది. అంతేకాకుండా ఇంటర్వెల్ వరకు అసలు కథ ఎలాంటి మలుపు తిరగదు. ఇక సినిమా లోని ప్లస్ ల విషయానికి వస్తే పార్ట్ 1 తో పోలిస్తే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా పార్ట్-2 చాలా బాగుంది. అంతేకాకుండా 3d టెక్నాలజీతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. సినిమాలో ప్రతి సీన్ కూడా త్రీడి ఎఫెక్ట్స్ తో ఉండడం వల్ల ప్రేక్షకులు సినిమా ను ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాకుండా కథలో లాజిక్ లను కూడా ఎక్కడా మిస్ కాకుండా తెరకెక్కించాడు.