Today Horoscope : ఈ రాశి వారికి ఆర్థిక ఆరోగ్య సమస్యలు తప్పవు…!
మేష రాశి : మేష రాశి వారికి నేడు ఆలోచనల స్థిరత్వం ఉండదు. అనారోగ్య వ్యాపార ఉద్యోగ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలను వాయిదా వేస్తారు.
వృషభ రాశి : ఈ రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవచింతన మరియు వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది.
మిధున రాశి : ఈ రాశివారు శుభవార్తలు వింటారు. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ది చేకూరుతుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటంతో పాటు సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలు సైతం తృప్తిని ఇస్తాయి.
కర్కాటక రాశి : ఈ రాశివారు ఏ పని చేపట్టినా నత్తనడకన సాగుతాయి. ఆస్తి వివాదాలతో పాటు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అంతే కాకుండా రుణాలు చేస్తారు. ఉద్యోగాలు, వ్యాపారాలు ప్రోత్సాహాన్నిస్థాయి.
సింహ రాశి : ఈ రాశివారికి రాబడి కి మించిన ఖర్చులు ఉంటాయి. శ్రమ తప్పదు ఆరోగ్య భంగం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆలయ దర్శనాలతో పాటూ దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాలు వ్యాపారాలు సాఫీగానే సాగుతాయి.
కన్యారాశి : ఈ రాశి వారికి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగం వ్యాపారాలు సాఫీగా సాగడంతో పాటు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు.
తులా రాశి :ఈ రాశివారికి సన్నిహితులతో విభేదాలు కలిగే అవకాశం ఉంది. దైవదర్శనాలతో పాటు దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో చిక్కులు తొలగిపోతాయి.
వృశ్చిక రాశి : ఈ రాశి వారు గతం నుండి ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభ పరిణామాలతో పాటు అదనపు ఆదాయం కలుగుతుంది. వ్యవహారాలలో పురోగతితో పాటు వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి లభిస్తుంది.
ధనస్సు రాశి : ధనస్సురాశి వారికి మిత్రులతో కలహాలు ఏర్పడతాయి. కొత్త రుణాలను చేస్తారు. అదే విధంగా కుటుంబంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటంతో పాటు ఉద్యోగ వ్యాపార సమస్యలు ఏర్పడతాయి.
మకరరాశి : ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి. దైవ దర్శనాలు… వ్యాపారాలలో అనుకూలత లభిస్తుంది. అదేవిధంగా ప్రముఖులతో వీరికి పరిచయాలు ఏర్పడతాయి.
కుంభరాశి : కుంభ రాశి వారికి వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఆస్తి కొనుగోలులో ఆటంకాలు కలుగే అవకాశం ఉంది. అదేవిధంగా వీరికి సంఘంలో మరింత గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
మీన రాశి : ఈ రాశి వారికి ప్రయాసలు తప్పవు. కుటుంబంలో చికాకులు.. ఆరోగ్య సమస్యలు వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మార్పులు వస్తాయి.