CM KCR : గ‌తంలో పాల‌మూరులో రోద‌న‌లు వేద‌న‌లు వినిపించేవి : సీఎం కేసీఆర్

మ‌ఖ్య‌మంత్రి కేసీఆర్ నేడు పాల‌మూరు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంధ‌ర్బంగా ఆయ‌న టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంతో పాటూ క‌లెక్ట‌రేట్ ను ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఒకప్పుడు పాల‌మూరులో రోద‌న‌లు వేద‌న‌లు ఉండేవ‌ని ఇప్పుడు అవి లేవ‌ని కామెంట్స్ చేశారు. తెలంగాణ‌లో ఏడేళ్ల క్రితం రూ.60 కోట్ల బ‌డ్జెట్ మాత్ర‌మే ఉండేద‌ని ఇప్పుడు మూడు ల‌క్ష‌ల కోట్ల‌కు తెచ్చామ‌ని చెప్పారు. సంక్షేమంలో మ‌న‌కు సాటి ఎవ‌రూ లేరని కేసీఆర్ అన్నారు.

 

గ‌తంలో భ‌యంక‌ర‌మైన క‌రెంట్ స‌మ‌స్య‌లు ఉండేవ‌ని ఇప్పుడు ఆ బాధ‌లు లేవ‌ని చెప్పారు. తెలంగాణ ఏవిధంగా ఉండాల‌ని కోరుకున్నామో ఇప్పుడు ఆ విధంగా ఉంద‌ని చెప్పారు. మ‌నం ఏం చేశ‌మ‌న్న‌దే మ‌ఖ్య‌మ‌ని జీవితానికి అదే సంతృప్తిని ఇస్తుంద‌ని పెట్టుబ‌డి అన్నారు. తెలంగాణ‌లో గురుకులాల సంఖ్య‌ను మూడు నాలుగు రెట్లు పెంచుతామ‌ని చెప్పారు. అదేవిధంగా కంటివెలుగు ఆశామాశీగా తీసుకువ‌చ్చిన కార్య‌క్ర‌మం కాద‌ని ఎంతో క‌ష్ట‌ప‌డి కంటివెలుగు కార్య‌క్ర‌మాన్ని తీసుకువ‌చ్చామ‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *