62 weds 21 marriage : 62 ఏళ్ల తాతతో 21 ఏళ్ల యువతి పెళ్లి..వీడియో వైరల్..!

సాధారణంగా పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయి అబ్బాయి మధ్య 10 ఏళ్ల లోపు ఉండేలా చూస్తారు. అయితే ఇక్కడ ఓ యువతి ఏకంగా తనకంటే 62 ఏళ్లు పెద్దవాడు అయిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధంచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని సెకన్ ల పాటు ఉన్న ఆ వీడియో లో ఇద్దరూ దండలు మార్చుకున్నారు.

 

పెళ్లి కొడుకు మాట్లాడుతూ పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం మలేషియా వెళతాం అని చెబుతున్నాడు. అంతే కాకుండా వీడియో తీస్తున్న వ్యక్తి…మీకు 21 ఏళ్లు మరి 62 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అని ప్రశ్నించాడు. దాంతో యువతి అలా పెళ్లి చేసుకుంటే తప్పేంటి అంటూ ఎదురు ప్రశ్న వేసింది. అయితే వీడియో కేవలం వైరల్ అవ్వడం కోసం చేశారని కూడా కొందరు చెబుతున్నారు. మరి కొందరు ఆ కపుల్ పై సెటైర్ లు వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *