MULA NAKSHATRAM : మూల న‌క్ష‌త్రంలో జ‌న్మించిన స్త్రీని ఎందుకు పెళ్లి చేసుకోకూద‌ని చెబుతారు..? చేసుకుంటే ఏం జ‌రుగుతుంది..?

వివాహం చేసుకునేటప్పుడు అందరూ కొన్ని నియమాలను తప్పక పాటిస్తారు. అలాంటి నియామల్లో జాతకం కలవడం ఒకటి. పెళ్లికి ముందు హిందూ సంప్ర‌దాయంలో క‌చ్చితంగా జాత‌కాలు క‌ల‌వాల‌ని చెబుతుంటారు. ఒక‌వేళ జాత‌కాలు క‌ల‌వ‌క‌పోతే పేర్లు మార్చ‌డం లేదా హోమాలు చేయ‌డం లాంటివి చేస్తుంటారు. ఇదిలా ఉంటే మూల న‌క్ష‌త్రంలో పుట్టిన అమ్మాయిల‌ను పెళ్లి చేసుకోకూడ‌ద‌ని అంటూ ఉంటారు.

 

మూల నక్షత్రం అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది వారికి కొన్ని శక్తులు… ఆత్మలు గుర్తుకు వ‌స్తాయి. ఆ న‌క్ష‌త్రంలో పుట్టిన‌వారికి ఎదో శక్తి ఉంటుందని వింటుంటాం. అలాగే అదొక మంచి నక్షత్రం కాదు అంటుంటారు. అంతే కాకుండా నక్షత్రంలో పుట్టిన స్త్రీల‌ను పెళ్లి చేసుకోవ‌డం వల్ల మంచిజ‌ర‌గ‌ది అంటూ ఉంటారు.లేదా ఆ న‌క్ష‌త్రంలో జ‌న్మించిన‌వాళ్లు కలిసి ఉండర‌ని ఎన్నో అపోహలతో ఉంటారు. అందులో ఎంత‌వ‌ర‌కూ నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..మ‌న‌కు మొత్తం 27నక్షత్రాలు ఉన్నాయి.

 

ములనక్షత్రం అన్ని న‌క్ష‌త్రాల‌కు రక్షశుడు అధిపతి అని పండితులు చెప్తుంటారు. సరస్వతి దేవి కూడా ఈ మూల నక్షత్రము లోనే జన్మించింది అని కూడా చెప్తుంటారు . కాబట్టి మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి మంచి తెలివి తేటలు ఉంటాయి. మూల నక్షత్రములో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. మూల నక్షత్రములో పుట్టిన అమ్మాయి చదువులోనూ ఇతర వృత్తిలో మొదటి స్థానంలోనే ఉంటారు. కాబట్టి మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నష్టం జరుగుతుందనే అపోహలను నమ్మొద్దని పండితులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *