Staff nurse jobs : ఏపీలో భారీగా నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్…ఇలా అప్లై చేసుకోండి…!
నర్సింగ్ విద్యార్థులకు ఏపీ సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 957 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. రీసెంట్ గా 461 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా దానికి ఆధనంగా 496 పోస్టులను కలిపి మొత్తం 957 పోస్టులతో సవరించిన నోటిఫికేషన్ ను ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ విడుదల చేశారు.
అంతేకాకుండా శుక్రవారం నుండి దరఖాస్తు ఫారంలను http://cfw.ap.nic.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు ప్రకటించారు. ఈనెల 8వ తేదీ వరకు దరఖాస్తులను వెబ్సైట్ లో పొందుపరుస్తున్నట్టు చెప్పారు. ఈ దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని భర్తీ చేసిన దరఖాస్తులను సంబంధిత రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో 9వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు సమర్పించాలని తెలిపారు.
జిఎన్ఎమ్ జనరల్ నర్సింగ్ మిడ్ వైపర్…. బీఎస్సీ నర్సింగ్ కోర్సులు పూర్తిచేసి 42 ఏళ్ల లోపు వయసు కలిగిన విద్యార్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు అని పేర్కొన్నారు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఓడబ్ల్యూసి అభ్యర్థులకు ఐదేళ్లు…. మాజీ సైనికులకు మూడేళ్లు వయోపరిమితి సడలించినట్లు చెప్పారు. దరఖాస్తు రుసుము ఓసి అభ్యర్థులకు 500 కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 300 గా నిర్ణయించారు. మెరిట్ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు.