SHAGUN KAUR : లైఫ్ ఈజ్ బ్యూటఫుల్ హీరోయిన్ ఇప్పుడు ఎంత మారిపోయిందో చూశారా..? ఏం చేస్తుందంటే..?
టాలీవుడ్ కు అందమైన హీరోయిన్లను పరిచయం చేసే డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. మిల్కీ బ్యూటీ తమన్నాను హ్యాపీడేస్ సినిమాతో శేఖర్ కమ్ముల టాలీవుడ్ కు పరిచయం చేశారు. అంతే కాకుండా ఆ సినిమాలో నటించిన చాలామంది హీరోలు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఆ తర్వాత హ్యాపీడేస్ లాగానే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే మరో యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను శేఖర్ కమ్ముల తెరకెక్కించారు.
ఈ ద్వారా కూడా చాలామంది నటీనటులను శేఖర్ కమ్ముల టాలీవుడ్ కు పరిచయం చేశాడు. ఇక ఈ సినిమాలో హీరో అభిజిత్ కు జోడిగా నటించిన అమ్మాయిని ఎవరు మర్చిపోలేరు. సినిమాలో షాగున్ కౌర్ పద్మావతి పాత్రలో అభిజిత్ కు హీరోయిన్ గా నటించింది. చూడడానికి పక్కింటి అమ్మాయిల నాజుగ్గా అందంగా కనిపించి ఒక్క సినిమాతోనే ప్రేక్షకులను బుట్టలో వేసుకుంది. తన అందంతో ఈ హీరోయిన్ ప్రేక్షకులను ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే ఈ సినిమా తర్వాత మాత్రం తమన్నా రేంజ్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సక్సెస్ అవ్వలేకపోయింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత షాగున్ కౌర్ ఒకటి రెండు సినిమాల్లో నటించినా వాటితో అంత గుర్తింపు రాలేదు.
దాంతో సినిమా ఇండస్ట్రీకి దూరమయింది. అందం అభినయం ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడంతో సినిమాలకు దూరం అవ్వాల్సి వచ్చింది. ఇక సినిమాలకు దూరమైన తర్వాత షాగున్ లా చదివినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా షాకున్ కౌర్ పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షాగున్ సోషల్ మీడియా లో సైతం కనిపించకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.