18 PAGES MOVIE REVIEW : “18 పేజెస్” సినిమా రివ్యూ..నిఖిల్ కు మరో బ్లాక్ బస్టర్ పడిందా..?
హ్యాపిడేస్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్ ఆ తరవాత సరైన హిట్ కొట్టలేక అవస్థలు పడ్డాడు. కానీ కార్తికేయ..స్వామిరార లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ లు అందుకున్నాడు. ఆ తరవాత రొటీన్ సినిమాల జోలికి వెల్లకుండా డిఫరెంట్ కథలతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రీసెంట్ గా కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు సాధించాడు. ఇక నిఖిల్ తాజాగా 18 పేజీస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా హిట్ అయ్యిందా ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం…
కథ
కథ సోషల్ మీడియాకు దూరంగా ఉండే నందిని అనుపమ పరమేశ్వరన్ ను సిద్దార్థ్ నిఖిల్ ఇష్టపడతాడు. ఆ తరవాత అనుపమను ప్రేమిస్తాడు. అయితే నందినికి జరిగింది మర్చిపోయే అరుదైన వ్యాధి ఉంటుంది. ఈ క్రమంలో అనుపమ ఓసారి కిడ్నాప్ అవుతుంది. దాన్ని తన డైరీలో రాసుకుంటుంది. సినిమాలో కిడ్నాప్ కు గురైన నందినిని సిద్దార్థ్ ఎలా పట్టుకున్నాడు.. ఆమె ప్రేమను ఎలా గెలిచాడు అనేదే ఈ సినిమా కథ..
విశ్లేషణ
సరికొత్త కథలను ఇష్టపడేవారికి 18 పేజీస్ సినిమా భాగా నచ్చుతుంది. ఈ సినిమాతో మరోసారి నిఖిల్ ప్రయోగం చేశాడు. ఈ సినిమాను డీసెంట్ హిట్ అని చెప్పవచ్చు. సినిమాలో నిఖిల్ అనుపమ తన నటనతో మెప్పించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ భాగా వర్కౌట్ అయ్యింది. అంతే కాకుండా ఈ సినిమా కథలో ప్రేక్షకులు లీనం అయిపోతారు. సినిమా ప్రేక్షకుడి చాలా భాగా కనెక్క్ అవుతుంది. గోపింసుందర్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమాలో వచ్చే ట్విస్ట్ లు ఎంతగానో ఆకట్టుకుంటాయి. రేసీ స్క్రీన్ ప్లే వల్ల ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను తప్పకుండా థియేటర్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు.