HEALTH BENEFITS OF CURD : ప్రతిరోజూ పెరుగు తింటున్నారా..? అయితే ఇవి తప్పక తెలుసుకోండి..?
భారతదేశ ఆయుర్వేద శాస్త్రంలో పెరుగుకు విశేష స్థానం ఉంది. భోజనం తరవాత పెరుగుతో కాస్త తింటేనే దానిని సంపూర్ణ భోజనం అంటారు. అంతే కాకుండా కొంతమంది పెరుగుతో తిన్న తరవాతే తృప్తిగా ఫీల్ అవుతారు. ఇక పెరుగు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే రోజువారీ ఆహారంలో పెరుగును తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.
పెరుగు అనేది ఒక పాల ఉత్పత్తి… ఇది పాల యొక్క బాక్టీరియా కిన్వన ప్రక్రియ ద్వారా తయారవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుకి మంచి గుర్తింపు ఉంది. పాలలోని లాక్టోజ్ ను పులియబెట్టడం వలన పెరుగు తయారవుతుంది. లాక్టోజ్ పాలలో లభించే సహజ చెక్కర. ఇది కిన్వాన ప్రక్రియ ద్వారా లాక్టిక్ ఆమ్లన్ని ఉత్పత్తి అవుతుంది. పెరుగులో అధిక మొత్తంలో కాల్షియం లభిస్తుంది. ఇది ఎముకల కి చాలా మంచిది.
ఎముకలు దృఢంగా అవడానికి పెరుగు ఎంతగానో ఉపయోగ పడుతుంది. కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు ప్రతి రోజూ పెరుగుతింటే ఆరోగ్యానికి మంచింది. రోజు ఒక కప్పు పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే కాల్షియం, మెగ్నీషియం శరీరానికి అందుతాయి. అదే విధంగా గట్ ఆరోగ్యాన్ని కూడా పెరుగు మెరుగుపరుస్తుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టిరీయా వల్ల గట్ ఆరోగ్యవంతంగా ఉంటుంది.