ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ విషయం నిన్న బయటకు రాగా ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి బిజెపి ప్రభుత్వంపై… ఈడి పై విమర్శల వర్షం కురిపించారు.
కవిత మాట్లాడుతూ…. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతోంది. ఈ సమయంలో 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నిక జరిగిన ఎనిమిది ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో బిజెపి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు రావడానికి ముందు మోడీ కంటే ఈడి ముందు వస్తున్నారు… ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం అని కవిత వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ పాలనలో ప్రభుత్వాలను కూల్చే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
తెలంగాణలో వచ్చే డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ కంటే ముందు ఈడి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద కానీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులపై కానీ వీడి దాడులు జరపడం సహజమని అన్నారు. ఈడి దాడులకు భయపడాల్సిన అవసరం లేదని…. సిబిఐ, ఈడి ప్రయోగించి అత్యంత చైతన్యవంతమైన తెలంగాణలో అధికారంలోకి రావాలనుకోవడం జరిగే పని కాదని కవిత కామెంట్స్ చేశారు. జైల్లో పెడతామంటే చేసేది ఏం లేదని జైల్లో పెట్టుకోవచ్చని భయపడే ప్రసక్తి లేదని కవిత కుండ బద్దలు కొట్టారు.
ముఖేష్ గౌడ్.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన…
ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ`. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్…
సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహిరిస్తూ ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం `రుద్రంకోట`. ఏఆర్ కె విజువల్స్ పతాకంపై…
ఇప్పటివరకు విడుదల అయిన సినిమాలలో నైజాం ఏరియాలో విడుదల అయిన మొదటి రోజు అత్యధిక షేర్ కలక్షన్లను వసూలు చేసిన…
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే మూవీలో హీరోగా…
టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను కలిగి ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి…
This website uses cookies.